Sun Dec 22 2024 14:02:21 GMT+0000 (Coordinated Universal Time)
రియల్ హీరో అంటూ గ్రంధిపై జగన్ ప్రశంసలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ రియల్ హీరో అంటూ ప్రశంసించారు
భీమవరంలో గత ఎన్నికల్లో గ్రంధి శ్రీనివాస్ పై పోటీ చేసిన సినిమా హీరో ను చూశారన్నారు. అయితే అదే సమయంలో గ్రంధి శ్రీనివాస్ మాత్రం రియల్ హీరో అంటూ ప్రశంసించారు. రియల్ లైఫ్ హీరో అంటూ భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ను ఉద్దేశించి అన్నారు. నిజంగా మంచి చేయడం కోసం తన దగ్గరకు వచ్చినప్పుడు శ్రీనివాస్ తనకు మంత్రి పదవి ఇవ్వకపోయినా ఫరవాలేదు కానీ భీమవరాన్ని జిల్లా కేంద్రాన్ని చేయాలని కోరారన్నారు. అందుకే గ్రంధి శ్రీనివాస్ రియల్ హీరో అని జగన్ ప్రశంసించారు.
ఆయన అడిగిన నిధులను...
గ్రంధి శ్రీనివాస్ అడిగిన మున్సిపాలిటీ, రూరల్ లో ఐదు వేల కోట్ల రూపాయలకు సంబంధించిన పనులను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఫుట్ పాత్ వంతెన నిర్మాణం కోసం అడిగిన నిధులను కూడా ఇస్తామని చెప్పారు. ఫుట్ పాత్ వంతెన కోసం పన్నెండు కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నానని జగన్ హామీ ఇచ్చారు. గ్రంధి శ్రీనివాస్ భీమవరం నియోజకవర్గం అభివృద్ధి కోసం అడిగిన అన్ని సమస్యలను పరిష్కరిస్తానని చెప్పారు. రాబోయే రోజుల్లో ఇంకా మంచి జరగాలని కోరుకుంటున్నానని జగన్ తెలిపారు.
Next Story