Mon Apr 28 2025 00:38:38 GMT+0000 (Coordinated Universal Time)
నేడు యర్రగొండపాలేనికి జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జగన్ నేడు యర్రగొండపాలెంకు రానున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జగన్ నేడు యర్రగొండపాలెంకు రానున్నారు. ఈ మేరకు మంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఉదయం జగన్ తాడేపల్లి నుంచి బయలుదేరి యర్రగొండపాలెంకు చేరుకోనున్నారు. మంత్రి సురేష్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు.
సురేష్ కుటుంబాన్ని..
మంత్రి సురేష్ తల్లి థెరిస్సమ్మ రెండు రోజుల క్రితం మరణించిన సంగతి తెలిసిందే. ఆమె విద్యారంగానికి విశేష కృషి చేశారు. మంత్రి ఆదిమూలపు సురేష్ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం జగన్ తిరిగి తాడేపల్లి చేరనున్నారు. యర్రగొండపాలెంలో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
Next Story