Mon Jan 06 2025 07:03:05 GMT+0000 (Coordinated Universal Time)
నేడు జగన్ ఎమ్మెల్యేలతో భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంపై సమీక్ష నిర్వహించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంపై సమీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు తాడేపల్లిని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంో ఈ సమీక్ష జరగనుంది. ఈ సమీక్షకు మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జులు పాల్గొననున్నారు.
గడప గడపకు ప్రభుత్వం....
గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో ఎవరు పాల్గొంటుందీ. ఎవరు దూరంగా ఉంటుందీ జగన్ ప్రత్యేకంగా నివేదికలు తెప్పించుకున్న జగన్ ఈ సమీక్షలో వాటిని బయటపెట్టనున్నారు. ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గం పరిధిలో ఏర్పాటు చేయాల్సిన బూత్ లెవెల్ కమిటీలపై కూడా జగన్ చర్చించనున్నారు.
Next Story