Wed Jan 15 2025 15:32:39 GMT+0000 (Coordinated Universal Time)
నేడు ఎంపీలతో జగన్?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు పార్లమెంటరీ సమావేశం నిర్వహించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు పార్లమెంటరీ సమావేశం నిర్వహించనున్నారు. జగన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో రాబోయే పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత ఈరోజు మధ్యాహ్నం పార్టీ లోక్ సభ, రాజ్యసభ సభ్యులతో జగన్ సమావేశం అవుతారు.
పార్లమెంటు సమావేశాల్లో...
ఈ నెల 29వ తేదీ నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ప్రధానంగా ఇటీవల కురిసిన వరదల వల్ల నష్టంపై కేంద్రం సాయం, ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన నిధులు వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి తెచ్చే విధంగా పార్లమెంటు సమావేశాల్లో పార్టీ వ్యవహరించాలని నిర్ణయించే అవకాశముంది.
Next Story