Sun Dec 29 2024 13:18:06 GMT+0000 (Coordinated Universal Time)
నేడు వాహనమిత్ర నిధులు విడుదల
నేడు వాహనమిత్ర నిధులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విడుదల చేయనున్నారు
నేడు వాహనమిత్ర నిధులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విడుదల చేయనున్నారు. విజయవాడలోని విద్యాధరపురంలో జరగనున్న బహిరంగ సభలో ఈ నిధులను లబ్దిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు. సొంత వాహనంతో స్వయం ఉపాధి పొందుతున్న ఆటో, ట్యాక్సీ, మక్సీ, క్యాబ్ డ్రైవర్లకు ఏటా పది వేల రూపాయల ఆర్థిక సాయం ప్రభుత్వం అందచేయనుంది.
ఐదో విడత కింద...
ఈసారి ఐదో విడత వాహనమిత్ర కింద నిధులను విడుదల చేయనున్నారు. 2,75,931 మంది లబ్దిదారులకు పది వేల రూపాయలు చొప్పున 275 కోట్ల రూపాయల నిధులను విడుదల చేయనున్నారు. ఒక్కొక్కరికి పదివేల రూపాయలను అందచేయనున్నారు. ఇప్పటి వరకూ వాహన మిత్ర పథకం కింద 1,301.89 కోట్ల రూపాయలు అందించినట్లు ప్రభుత్వం తెలిపింది. నిధులు విడుదల చేసిన అనంతరం జరగనున్న బహిరంగ సభలో జగన్ ప్రసంగించనున్నారు.
Next Story