Sat Nov 23 2024 05:03:41 GMT+0000 (Coordinated Universal Time)
రేపటి నుంచి కడప జిల్లాలో జగన్ పర్యటన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపటి నుంచి కడప జిల్లాలో పర్యటించనున్నారు. మూడు రోజుల పాటు ఆయన పర్యటన సాగనుంది
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపటి నుంచి కడప జిల్లాలో పర్యటించనున్నారు. మూడు రోజుల పాటు ఆయన పర్యటన సాగనుంది. అభివృద్ధి కార్యక్రమాలతో పాటు క్రిస్మస్ ప్రార్థనల్లోనూ ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. రేపు 10.15 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి 11.30 గంటలకు కడప ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి బయలుదేరి 12.20 కడప అమీన్ పీర్ దర్గాకు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలను నిర్వహిస్తారు. మధ్యాహ్నం మాధవి కన్వెన్షన్ సెంటర్లో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి అఫ్జల్ఖాన్ కుమారుడి వివాహ వేడుకలకు హాజరవుతారు.
రెండో రోజు ఉదయం...
అనంతరం రెండు గంటల ప్రాంతంలో కమలాపురం చేరుకోనున్న జగన్ వివిధ అభివృద్ధి కార్యక్రమలకు శంకుస్థాపన చేయనున్నారు. బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం ఇడుపులపాయకు చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు. ఎల్లుండి ఉదయం 9 గంటలకు ఇడుపుల పాయలని వైఎస్సార్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. అనంతరం అక్కడి చర్చిలో ప్రార్థనలు చేస్తారు. 12.40 గంటలకు పులివెందులలోని భాకరాపూరం చేరుకుని అక్కడ విజయ హోమ్స్ జంక్షను ప్రారంభిస్తారు.
మూడో రోజు...
అనంతరం కదిరి రోడ్డు జంక్షన్ ను, రోడ్డ విస్తరణ పనులను జగన్ ప్రారంభిస్తారు. మధ్యాహ్నం రెండు గంటలకు కూరగాయల మార్కెట్ ను జగన్ ప్రారంభించనున్నారు. 2.20 గంటలకు మైత్రి లే అవుట్ ను ప్రారంభించనున్నారు. అనంతరం రాయలాపురం వంతెనను ప్రారంభించనున్నారు. అనంతరం మూడు గంటలకు వైఎస్సార్ బస్టాండ్ ను ప్రారంభిస్తారు. అక్కడ సభలో ప్రసంగించనున్నారు. అనంతరం అహోబిలపురం స్కూల్ అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. తిరిగి సాయంత్రం ఇడుపులపాయకు చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు. ఈ నెల 25 ఉదయం 9.05 గంటలకు పులివెందుల చేరుకుని సీఎస్ఐ చర్చిలో జరిగే ప్రార్థనల్లో పాల్గొంటారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12.20 గంటలకు తాడేపల్లికి చేరుకుంటారు.
Next Story