Fri Apr 25 2025 16:13:27 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : రెండోరోజు జగన్ పర్యటన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు రెండోరోజు కడప జిల్లాలో పర్యటించనున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు రెండోరోజు కడప జిల్లాలో పర్యటించనున్నారు. నేడు పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించనున్నారు.నిన్న అన్నమయ్య జిల్లా, కడప జిల్లాలో పర్యటించిన జగన్ వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం ప్రయివేటు కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు. రాత్రికి ఇడుపులపాయ గెస్ట్హౌస్ లో బస చేశారు.
ప్రారంభోత్సవాలతో...
ఈరజు ఇడుపుల పాయ ఆర్కే వ్యాలీ పోలీస్ స్టేషన్ ను ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించనున్నారు. అనంతరం ప్రజాప్రతినిధులతో ఆయన సమావేశమవుతారు. జగన్ పర్యటన సందర్భంగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమం పూర్తయిన అనంతరం ఆయన పులివెందుల నుంచి బయలుదేరి తాడేపల్లికి చేరుకుంటారు.
Next Story