Mon Dec 23 2024 12:18:51 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : నేడు కడప జిల్లాకు జగన్
ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కడప జిల్లాలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించనున్నారు
ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కడప జిల్లాలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించనున్నారు. కడప, పులివెందుల నియోజకవర్గాల్లో ఆ పర్యటన సాగుతుంది. ముఖ్యమంత్రి జగన్ ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి పులివెందుల చేరుకుంటారు. ముందుగా వైఎస్సార్ గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రిని ప్రారంభిస్తారు, తర్వాత బనాన ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్ ను ప్రారంభిస్తారు, అక్కడి నుంచి బయలుదేరి డాక్టర్ వైఎస్సార్ మినీ సెక్రటేరియట్ కాంప్లెక్‌కు చేరుకుని ప్రారంభిస్తారు, అనంతరం డాక్టర్ వైఎస్సార్ జంక్షన్‌కు చేరుకుని ప్రారంభిస్తారు.
పులివెందులలో....
అక్కడే సెంట్రల్ బౌల్ వార్డ్ ప్రారంభించిన తర్వాత వైఎస్ జయమ్మ షాపింగ్ కాంప్లెక్స్‌కు చేరుకుని దానిని ప్రారంభిస్తారు, అక్కడి నుంచి గాంధీ జంక్షన్‌కు చేరుకుని ప్రారంభించిన అనంతరం డాక్టర్ వైఎస్సార్ ఉలిమెల్ల లేక్ ఫ్రంట్ వద్దకు చేరుకుని ప్రారంభోత్సవం చేస్తారు, తర్వాత ఆదిత్యా బిర్లా యూనిట్‌కు చేరుకుని ఫేజ్ 1 ప్రారంభోత్సవంలో పాల్గొంటారు, అక్కడి నుంచి బయలుదేరి సంయూ గ్లాస్ వద్దకు చేరుకుని, అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం ఇడుపులపాయ చేరుకుంటారు, వైఎస్సార్ మెమోరియల్ పార్కు ప్రారంభోత్సవంలో జగన్ పాల్గొంటారు, అనంతరం క్కడి నుంచి బయలుదేరి సాయంత్రం తాడేపల్లి చేరుకుంటారు.
Next Story