Sat Jan 04 2025 13:09:16 GMT+0000 (Coordinated Universal Time)
కొవ్వూరుకు జగన్
ఈ నెల 14వ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు
ఈ నెల 14వ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. అంబేద్కర్ జయంతి రోజున ఆయన పర్యటన కొవ్వూరులో సాగనుంది. ఈ సందర్భంగా జగన్ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు.
భారీ బహిరంగ సభలో...
దీంతో అధికారులు ముఖ్యమంత్రి జగన్ పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే హోంమంత్రి తానేటి వనిత బహిరంగ సభ జరిగే స్థలాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు అందించారు. పెద్దయెత్తున జనసమీకరణ చేసేందుకు వైసీపీ నేతలు సిద్ధమయ్యారు. పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు.
Next Story