Mon Dec 23 2024 14:23:45 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : నేడు రెండు జిల్లాలకు జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు కర్నూలు, గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు కర్నూలు, గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. కర్నూలు జిల్లాలో ఒక వివాహ వేడుకలో పాల్గొనేందుకు వెళతారు. అక్కడి నుంచి వచ్చి గుంటూరు జిల్లాకు చేరుకుంటారు. గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రతి నియోజకవర్గానికి సంబంధించి ఎంపిక చేసిన వాలంటీర్లకు సేవా వజ్ర అవార్డును అందిస్తారు. దానితో పాటు నలభై ఐదువేల రూపాయల నగదును అందచేయనున్నారు.
వాలంటీర్లకు సత్కారం..
ప్రతి మండలం, మున్సిపాలిటీ నుంచి ఐదుగురికి సేవారత్న పురస్కారం అందిస్తారు. వీరికి ముప్పయి వేల అవార్డు అందించనున్నారు. మిగిలిన వాలంటీర్లకు సేవా మిత్ర అవార్డుతో పాటు పదిహేనువేల నగదును అందచేయనున్నారు. మొత్తం 2.55 లక్షల మంది వాలంటీర్లకు 392కోట్ల రూపాయలు అందచేయనున్నారు. వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు సంక్షేమ పధకాలను అందిచండంతో పాటు వివిధ రకాల సేవలను అందచేస్తున్నందున ప్రభుత్వం ప్రతి ఏడాది ఈ అవార్డులను ప్రదానం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈకార్యక్రమంలో పాల్గొన్న అనంతరం జరిగే బహిరంగ సభలో ప్రసంగించి తర్వాత తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి చేరుకుంటారు.
Next Story