Thu Dec 26 2024 19:26:46 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : నేడు కర్నూలుకు వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు కర్నూలు, నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు కర్నూలు, నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు. వైఎస్సార్ ఈబీసీ నేస్తం నిధులను విడుదల చేయనున్నారు. బనగానపల్లిలో జరగనున్న బహిరంగ సభలో ప్రసంగించిన అనంతరం ముఖ్యమంత్రి జగన్ ఈబీసీ నేస్తం నిధులను లబ్దిదారుల ఖాతాల్లో బటన్ నొక్కి విడుదల చేయనున్నారు. ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి క్యాంప్ నుంచి బయలుదేరి ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకుంటారు.
వైఎస్సార్ ఈబీసీ నేస్తం నిధులను...
అక్కడ నేషనల్ లా యూనివర్సిటీకి భూమి పూజ చేస్తారు. తర్వాత నంద్యాల జిల్లా బనగానపల్లి వెళ్లి వైఎస్సార్ ఈబీసీ నేస్తం నిధులను విడుదల చేస్తారు. ఆ తర్వాత తిరిగి తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి చేరుకుంటారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు అన్ని పూర్తయ్యాయి. పెద్దయెత్తున జనసమీకరణ చేసేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
Next Story