Sat Jan 11 2025 18:48:54 GMT+0000 (Coordinated Universal Time)
ఈ నెల 20న నెల్లూరుకు జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ నెల 20వ తేదీన నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ నెల 20వ తేదీన నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు జగన్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి ముఖ్యమంత్రి పర్యటన ఎక్కడెక్కడ అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. నెల్లూరు జిల్లాలో జగన్ పర్యటనతో అధికారులు, పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లు చేయడానికి సిద్ధమవుతున్నారు.
అసంతృప్తి....
ఇటీవల కాలంలో నెల్లూరు జిల్లాలో అసంతృప్త నేతల గళం పెరిగిపోవడం తెలిసిందే. ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ల స్థానంలో నియోజకవర్గాలకు కొత్తగా సమన్వయ కర్తలను నియమించారు. నెల్లూరు జిల్లాలో జగన్ పర్యటన పార్టీలో సమస్యలను తొలగించడానికి ఉపయోగపడుతుందని వైసీపీ నేతలు భావిస్తున్నారు.
Next Story