Sat Jan 11 2025 21:57:03 GMT+0000 (Coordinated Universal Time)
27న నెల్లూరు జిల్లాకు జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ నెల 27న నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఈ నెల 27న నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. ముత్తుకూరు మండలంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొననున్నారు. అక్కడ నేలటూరు గ్రామంలో ఏపీ జెన్కో పవర్ స్టేషన్ లో మూడో యూనిట్ ను జగన్ ప్రారంభించనున్నారు.
పవర్ యూనిట్ కు...
ఈ యూనిట్ 800 మెగావాట్ల సామర్థ్యం కలిగి ఉంటుందని అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు కూడా ఈ కార్యక్రమానికి హాజరుకానుండటంతో అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. జగన్ నెల్లూరు జిల్లా పర్యటనలో ప్రత్యేకంగా వైసీపీ నేతలతో సమావేశమయ్యే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Next Story