Mon Dec 23 2024 06:21:31 GMT+0000 (Coordinated Universal Time)
నేడు ప్రకాశం జిల్లాకు జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. యర్రగొండపాలెంలో జరగనున్న వివాహ వేడుకకు హాజరుకానున్నారు. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కుమార్తె వివాహం ఇటీవల జరిగింది. ఆ వివాహ రిసెప్షన్ ను యర్రగొండపాలెంలో నేడు జరుపుతున్నారు.ః
కర్నూలులో జరిగిన తప్పిదం....
ఈ వివాహ వేడుకకు ముఖ్యమంత్రి జగన్ తో పాటు మంత్రివర్గ సభ్యులు కూడా రానున్నారు. దీంతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇటీవల కర్నూలు జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఇంట వివాహ వేడుకకు జగన్ హాజరైనప్పుడు సెక్యూరిటీ లోపం కన్పించింది. దీంతో అధికారులు ప్రకాశం జిల్లాలో అలాంటి లోపాలు లేకుండా పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు.
Next Story