Mon Dec 15 2025 04:13:15 GMT+0000 (Coordinated Universal Time)
రెండో రోజు జగన్ పర్యటన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు రెండో రోజు వరద ప్రాంతాల్లో పర్యటించనున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు రెండో రోజు వరద ప్రాంతాల్లో పర్యటించనున్నారు. నిన్న కోనసీమ జిల్లాలో పర్యటించిన జగన్ నేడు అల్లూరి సీతారామరాజు జిల్లా, ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు. అక్కడ బాధితులను పరామర్శించనున్నారు. బాధితులతో జగన్ నేరుగా మాట్లాడనున్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లా చింతూరుకు చేరుకుని ఆ మండలంలోని కుయుగూరు, చట్టి గ్రామాల్లో వరద బాధితులతో జగన్ సమావేశం కానున్నారు. వారికి అందిన సాయం గురించి స్వయంగా అడిగి తెలుసుకోనున్నారు.
ఏలూరు జిల్లాలో..
ఈరోజు మధ్యాహ్నం ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం కన్నయ్యగుట్ట గ్రామంలోనూ జగన్ పర్యటించనున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ ను జగన్ పరిశీలించనున్నారు. ఆ తర్వాత నార్లవరం, తిరుమలాపురం గ్రామాలకు చెందిన వరద బాధితులతో జగన్ సమావేశమవుతారు. అనంతరం అక్కడి నుంచి బయలు దేరి నేరుగా తాడేపల్లికి జగన్ చేరుకుంటారు.
Next Story

