Mon Dec 23 2024 09:30:49 GMT+0000 (Coordinated Universal Time)
ఈనెల 16న తిరుపతికి సీఎం జగన్
ఏపీ సీఎం వైఎస్ జగన్ ఈ నెల 16వ తేదీన తిరుపతిలో పర్యటించనున్నారు. ఆయన తిరుపతిలో నిర్మించిన ఫ్లైఓవర్ ను ప్రారంభించనున్నారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ నెల 16వ తేదీన తిరుపతిలో పర్యటించనున్నారు. ఆయన తిరుపతిలో నిర్మించిన ఫ్లైఓవర్ ను ప్రారంభించనున్నారు. గత కొంత కాలంగా నిర్మిస్తున్న శ్రీనివాససేతు మొదటి దశ ఫ్లైఓవర్ పనులు పూర్తయ్యాయి. దీనిని ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు ఈ నెల 16వ తేదీన ఫ్లైఓవర్ ను ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు.
శ్రీనివాస సేతును....
ఆర్టీసీ బస్టాండ్ నుంచి కపిలతీర్థం వరకూ నిర్మించిన ఈ ఫ్లై ఓవర్ ను ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించనున్నారు. మొత్తం 1.5 కిలో మీటర్ల మేరకు తొలిదశ ఫ్లైఓవర్ పనులు పూర్తయ్యాయి. మరో రెండు దశల పనులు పూర్తి కావాల్సి వచ్చింది. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే తిరుపతివాసులకు ట్రాఫిక్ కష్టాలు తీరినట్లే.
Next Story