Tue Dec 17 2024 11:47:50 GMT+0000 (Coordinated Universal Time)
ఉత్తరాంధ్రలో ఎల్లుండి జగన్ పర్యటన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ నెల 3న విశాఖ, విజయనగరం జిల్లాల్లో పర్యటించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎల్లుండి విశాఖ, విజయనగరం జిల్లాల్లో పర్యటించనున్నారు. విజయనగరం జిల్లాలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి జగన్ శంకుస్థాపన చేయనున్నారు. భోగాపురంలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన విశాఖకు బయలుదేరి వెళతారు.
ఉదయం నుంచే...
ఈ నెల 3వ తేదీన ఉదయం ఎనిమిది గంటలకు జగన్ తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి పది గంటలకు భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రాంతానికి చేరుకుంటారు. 10.30 గంటలకు భోగాపురం ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన చేసిన అనంతరం చింతపల్లి ఫిష్ లాండింగ్ సెంటర్, నిర్మాణం, తారక రామ తీర్థ సాగర్ ప్రాజెక్టు మిగులు పనులకు సంబంధించిన శిలాఫలకాలను ఆవిష్కరిస్తారు. అక్కడి నుంచి బహిరంగ సభలో మాట్లాడిన అనంతరం విశాఖ వెళ్లి అక్కడ ఐటీ టెక్ పార్క్‌కు శంకుస్థాపన చేసి అనంతరం తాడేపల్లి బయలుదేరి వస్తారు.
Next Story