Sun Apr 06 2025 10:28:26 GMT+0000 (Coordinated Universal Time)
రామనుజాచార్య బాటలోనే అందరూ నడవాలి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు ముచ్చింతల్ లోని సమతా మూర్తి విగ్రహాన్ని సందర్శించుకున్నారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు ముచ్చింతల్ లోని సమతా మూర్తి విగ్రహాన్ని సందర్శించుకున్నారు. 108 దివ్యాలయాలను దర్శించుకున్నారు. జగన్ కు చిన జీయర్ స్వామి స్వయంగా రామానుజాచార్యుల విశిష్టతను గురించి వివరించారు. సమతా విగ్రహాన్ని తాను స్థాపించడం వెనక ఉద్దేశ్యాన్ని చిన జీయర్ స్వామి వివరించారు.
విదేశీ చిన్నారులు....
ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ వెయ్యేళ్ల క్రితమే రామానుజాచార్యులు సమ సమాజం కోసం కృషి చేశారని గుర్తు చేశారు. ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడం వెనక చినజీయర్ స్వామిజీ కృషి ఎంతో ఉందని చెప్పారు. అందరినీ సమానంగా చూడటమే రామానుజా చార్యుల వారి సిద్ధాంతమని చెప్పారు. అందరం ఆయన బాటలోనే నడవాలని జగన్ పిలుపు నిచ్చారు. తన సమక్షంలో శ్లోకాలను ఆలపించిన అమెరికాకు చెందిన చిన్నారులను జగన్ అభినందించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు పాల్గొన్నారు.
Next Story