Mon Apr 07 2025 08:17:14 GMT+0000 (Coordinated Universal Time)
రేపు నర్సీపట్నానికి సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు అనకాపల్లి జిల్లాలో పర్యటించనున్నారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు అనకాపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. నర్సీపట్నం నియోజకవర్గంలో వెయ్యి కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేయను్నారు. అలాగే మాకవరంలో సూపర్ స్పెషలిటీ ఆసుపత్రి, మెడికల్ కళాశాల కోసం భూమి పూజ చేయనున్నారు. 500 కోట్ల రూపాయల వ్యయంతో వీటిని నిర్మించనున్నారు.
శంకుస్థాపనలు...
అనంతరం తాండవ ఎత్తిపోతల పథకానికి కూడా ముఖ్యమంత్రి జగన్ శంకుస్థాపన చేయనున్నారు. ఏలేరు జలాశయం నుంచి తాండవ రిజర్వాయర్ కు మళ్లిస్తే దాదాపు అరవై వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. 450 రూపాయల కోట్ల రూపాయలను ఇందుకోసం ఖర్చు చేయనున్నారు. అనంతరం నర్సీపట్నంలోని జోగునాథునిపాలెంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్ ప్రసంగించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
Next Story