Mon Dec 23 2024 18:09:52 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ కుప్పం పర్యటన వాయిదా
ఈ నెల 22వ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కుప్పం పర్యటన వాయిదా పడింది.
ఈ నెల 22వ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కుప్పం పర్యటన వాయిదా పడింది. అనివార్య కారణాల వల్ల వాయిదా పడిందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 22వ తేదీన జగన్ కుప్పం నియోజకవర్గంలో పర్యటించాల్సి ఉంది. ఆయన అక్కడ వైఎస్సార్ చేయూత కింద నగదును లబ్దిదారులకు అందచేయాల్సి ఉంది.
ఒకరోజు మాత్రమే...
అయితే జగన్ కుప్పం పర్యటన ఈ నెల 23వ తేదీకి వాయిదా పడింది. షెడ్యూల్ యధాతధంగా ఉంటుందని, ముఖ్యమంత్రి పర్యటన ఒకరోజు మాత్రమే వాయిదా పడిందని అధికారులు తెలిపారు. జగన్ కుప్పం పర్యటన కోసం ఇప్పటికే అక్కడ అధికారులు, పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు.
Next Story