Wed Dec 25 2024 02:12:26 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : నేడు ఒంగోలుకు జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు ఒంగోలులో పర్యటించనున్నారు. ఇళ్ల పట్టాలను పంపిణీ చేయనున్నారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు ఒంగోలులో పర్యటించనున్నారు. ఒంగోలు కార్పొరేషన్ పరిధిలో దాదాపు ఇరవై వేల మందికి ఇళ్ల పట్టాలను జగన్ పంపిణీ చేయనున్నారు. వీటితో పాటు ఇళ్లను మంజూరు చేస్తున్నట్లు పత్రాలను కూడా పంపిణీ చేయనున్నారు. ఒంగోలు మండలం ఎస్ అగ్రహారంలో ఈ కార్యక్రమానికి జగన్ హాజరు కానున్నారు. ఈ ఇళ్ల స్థలాలను పొందిన వారిలో ఒంగోలు నియోజకవర్గం పరిధిలోని మల్లేశ్వరపురం, అగ్రహారం, యరజర్ల, వెంముక్కలపాలెం గ్రామాల్లో 536 ఎకరాలను సేకరించారు.
ఇరవై వేల మందికి...
పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తిని ముఖ్యమంత్రి జగన్ పరిశీలించి వెంటనే నిధులను మంజూరు చేయడంతో ఇళ్ల పట్టాల మంజూరు సాధ్యమయింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ ప్రసంగించనున్నారు. జగన్ పర్యటన సందర్భంగా భారీ బందోబస్తును ఏర్పాటు చేయనున్నారు. ఒంగోలు నియోజకవర్గం నుంచే కాకుండా ప్రకాశం జిల్లా నుంచి కూడా పెద్దయెత్తున ఈ కార్యక్రమానికి కార్యకర్తలు తరలి రానున్నారు.
Next Story