చంద్రబాబే ప్రధాన కుట్రదారు..?
ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయనను అరెస్టు..
ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయనను అరెస్టు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చంద్రబాబును నంద్యాలలో అరెస్టు చేసిన సీఐడీ పోలీసులు.. ఈ కేసుకు సంబంధించి వివరాలు తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్లో పలు అక్రమాలు జరిగాయని గుర్తించామని, అందుకే అరెస్టు చేస్తున్నామని తెలిపారు. 370 కోట్ల స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక పాత్ర పోషించారని ఆంధ్రప్రదేశ్ నేర పరిశోధన విభాగం ఆరోపించింది. నిధులను మళ్లించే ప్రయత్నంలో నిబంధనలను ఉల్లంఘించిన స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఎంవోయూకు నాయుడు కుట్ర పన్నారని, దానిని ఆమోదించారని పేర్కొన్నారు. ఈ నిధులను షెల్ కంపెనీలకు మళ్లించారని, ఆ తర్వాత నగదుగా విత్డ్రా చేశారని, ఆ తర్వాత వాటిని నయీంతో సంబంధం ఉన్న వ్యక్తులకు అందజేశారని సీఐడీ ఆరోపించింది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను సీఐడీ పోలీసులు వివరించారు. తాము అన్ని పరిశీలించిన తర్వాతే చంద్రబాబును అరెస్టు చేశామని చెబుతోంది.