Wed Apr 23 2025 16:28:48 GMT+0000 (Coordinated Universal Time)
ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. అక్కడి నుండి మహారాష్ట్ర
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లనున్నారు

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంటకు ఆయన ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. తొలుత వెలగపూడి సచివాలయం ఎదురుగా ఉన్న హెలిప్యాడ్ నుంచి హెలికాఫ్టర్లో గన్నవరం విమానాశ్రయానికి చంద్రబాబు చేరుకుంటారు. అక్కడి నుండి ప్రత్యేక విమానంలో ఆయన ఢిల్లీకి వెళ్లనున్నారు. సాయంత్రం 3.45 గంటలకు ఢిల్లీకి చేరుకుంటారు.
ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులతో చంద్రబాబు సమావేశం అవుతారు. రాష్ట్రాభివృద్ధికి సంబంధించి పలు విషయాలపై చర్చించనున్నారు. శనివారం ఢిల్లీ నుంచి మహారాష్ట్రకు చంద్రబాబు బయలుదేరి వెళ్లనున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీకి జరగనున్న ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొననున్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ కూటమి విజయం సాధించాలని భావిస్తోంది. ఇతర రాష్ట్రాలకు చెందిన పలువురు నేతలు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.
Next Story