Mon Dec 23 2024 08:09:56 GMT+0000 (Coordinated Universal Time)
మాస్టర్స్ డిగ్రీ పట్టా అందుకున్న సీఎం వైఎస్ జగన్ తనయ
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుమార్తె మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుమార్తె మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. ఆమె ఈ ఘనత సాధించడం పట్ల సీఎం వైఎస్ జగన్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. డియర్ హర్షా చాలా గర్వంగా ఉంది అంటూ ట్వీట్ చేశారు. నీవు ఎదిగిన తీరు అమిత సంతోషాన్నిచ్చిందని.. దేవుడు నీ పట్ల కృప చూపించాడని.. ఈ రోజు ఇన్సీడ్ నుంచి డిస్టింక్షన్‌తో గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడం గర్వంగా ఉందని చెప్పుకొచ్చారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూతురు వైఎస్ హర్షిణి రెడ్డి మాస్టర్స్‌లో.. డిస్టింక్షన్‌తో సత్తా చాటారు. ఈ మేరకు వర్సిటీ నుంచి హర్షిణి రెడ్డి పట్టా తీసుకుంటున్న వీడియోను వైఎస్సార్సీపీ టీమ్ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. కూతురు మాస్టర్స్ పూర్తి చేసి పట్టా పుచ్చుకునే కార్యక్రమం(స్నాతకోత్సవం)లో పాలుపంచుకునేందుకు జగన్ దంపతులు పారిస్ వెళ్లారు. తల్లిదండ్రుల సమక్షంలోనే హర్షిణి రెడ్డి పట్టా పుచ్చుకున్నారు. పట్టా అందుకున్న కూతురుతో కలిసి జగన్ దంపతులు ఫొటో దిగారు. ఈ ఫొటోను జగన్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. శనివారం వర్సిటీలో జరిగిన స్నాతకోత్సవంలో భాగంగా మాస్టర్స్ డిగ్రీ పట్టాను హర్షిణి అందుకున్నారు.
Next Story