Sun Dec 22 2024 21:38:22 GMT+0000 (Coordinated Universal Time)
Ys Sharmila : వైఎస్ కు మీరు వారసులెలా అవుతారు? జగన్ కు షర్మిల ప్రశ్న
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఆమె గుండ్లకమ్మ ప్రాజెక్టును పరిశీలించారు
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్నారు. కొద్దిసేపటి క్రితం ఆమె గుండ్లకమ్మ ప్రాజెక్టును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ ప్రాజెక్టును నిర్మించారన్న షర్మిల, గేట్లు కొట్టుకు పోతుంటే ఇరిగేషన్ మంత్రి సంక్రాంతి డ్యాన్సులు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. 750 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మించిన ప్రాజెక్టును ఈ ప్రభుత్వం గాలికి వదిలేసిందని షర్మిల ఆరోపించారు. నిర్వహణ లేకనే గేట్లు కొట్టుకుపోయాయని, అయినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.
గుండ్లకమ్మ ప్రాజెక్టును...
మరమ్మతులు చేయాల్సిన ప్రభుత్వం చోద్యం చూస్తుందని ఆమె ఫైర్ అయ్యారు. ఇక్కడ అధికారులు ఏం చేస్తున్నారని ఆమె ప్రశ్నించారు. జగనన్నకు మరమ్మతులు చేయించడానికి కూడా మనసు రావడం లేదని అన్నారు. ఇదేనా వైఎస్సార్ ఆశయం నిలబెట్టడం అంటే అని షర్మిల నిలదీశారు. వైఎస్సార్ కట్టిన ప్రాజెక్టును పట్టించుకోని మీరు వైఎస్సార్ వారసులు ఎలా అవుతారని షర్మిల ప్రశ్నించారు. ఇప్పటికైనా గుండ్లకమ్మ ప్రాజెక్టుకు మరమత్తులు చేయకుంటే పెద్ద ప్రమాదం జరుగుతుందని ఆమె ఆందోళన చెందారు.
Next Story