Sat Dec 21 2024 13:07:56 GMT+0000 (Coordinated Universal Time)
Ys Sharmila : నేడు ఉత్తరాంధ్రలో వైఎస్ షర్మిల
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల నేడు విశాఖ, శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల నేడు విశాఖ, శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్నారు. న్యాయయాత్ర పేరిట షర్మిల ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ వైఎస్ షర్మిల విస్తృతంగా ఆంధ్రప్రదేశ్ అంతటా పర్యటిస్తున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ కావడంతో ప్రజలు కూడా సభలకు బాగానే వస్తుండటంతో కాంగ్రెస నేతల్లో ఉత్సాహం నెలకొంది.
మూడు నియోజకవర్గాల్లో...
ఈరోజు వైఎస్ షఱ్మిల ఉదయం తొమ్మిది గంటలకు విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద జరిగే మీడియా సమావేశంలో పాల్గొంటారు. అనంతరం అక్కడ జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. సాయంత్రం నాలుగు గంటలకు టెక్కలిలో జరిగే బహిరంగ సభలో షర్మిల పాల్గొని ప్రసంగిస్తారు. తర్వాత సాయంత్రం ఆరు గంటలకు పలాసలో జరిగే సభలోనూ ఆమె పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Next Story