Fri Dec 20 2024 22:09:38 GMT+0000 (Coordinated Universal Time)
Ys Sharmila : నేడు ప్రొద్దుటూరులో వైఎస్ షర్మిల
ఈరోజు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల కడప జిల్లాలో పర్యటించనున్నారు.
ఈరోజు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొంటున్నారు. ప్రొద్దుటూరు నియోజక వర్గంలో కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిలా ఎన్నికల ప్రచారం కొనసాగంచనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఉదయం 11 గంటలకు రామేశ్వరం 4 రోడ్ల జంక్షన్ వద్ద నుంచి ప్రచారం ప్రారంభించనున్నారు.
న్యాయయాత్ర పేరిట...
న్యాయయాత్ర పేరిట వైఎస్ షర్మిల ఏపీలోని అన్ని జిల్లాల్లో విస్తృతంగా పర్యటిస్తూ వైసీపీ ప్రభుత్వం, టీడీపీ, బీజేపీలపై విమర్శలు చేస్తూ వెళుతున్నారు. తాము అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా గ్యారంటీ అని చెబుతున్నారు. ఈరోజు ప్రొద్దుటూరులోని ఆర్ట్స్ కాలేజి క్రాస్ రోడ్, రిషి అపార్ట్మెంట్,వాసవి కళ్యాణ మండపం,భగత్ సింగ్ కాలనీ,సంజీవ్‌నగర్,శ్రీనివాస్‌నగర్,శివాలయంసెంటర్,జిన్నారోడ్,అమృతనగర్,ఖాదర్ బాద్ మీదుగా ప్రచారం కొనసాగిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Next Story