Mon Dec 23 2024 08:44:36 GMT+0000 (Coordinated Universal Time)
Ys Sharmila : నేడు ప్రకాశం జిల్లాలో వైఎస్ షర్మిల
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల నేడు ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల నేడు ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం పది గంటలకు షర్మిల యర్రగొండపాలెం లో పర్యటిస్తారు. ఆమె గత కొద్ది రోజులుగా న్యాయయాత్ర పేరిట రాష్ట్రంలో పర్యటిస్తూ కాంగ్రెస్ అభ్యర్థుల విజయం కోసం ఆమె ప్రచారం చేస్తున్నారు. వైసీపీ, టీడీపీని ఓడించాలంటూ ఆమె పిలుపు నిస్తున్నారు.
మూడు సభల్లో...
ీఈరోజు వైఎస్ షర్మిల యర్రగొండపాలెం సభలో ప్రసంగించిన తర్వాత సాయంత్రం సంతనూతలపాడు కు చేరుకుంటారు. అక్కడి సభలో ప్రసంగించిన అనంతరం అద్దంకిలో జరిగే సభకు హాజరవుతారు. వరస సభలతో వైఎస్ షర్మిల కాంగ్రెస్ కు పూర్వ వైభవాన్ని తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. షర్మిల పర్యటనను విజయవంతం చేసేందుకు పార్టీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.
Next Story