Mon Dec 23 2024 07:55:13 GMT+0000 (Coordinated Universal Time)
Ys Sharmila : ఇడుపులపాయలో ఓటు వేసిన వైఎస్ షర్మిల
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పులివెందుల నియోజక వర్గంలోని వేంపల్లె మండలం ఇడుపులపాయ పోలింగ్ కేంద్రంలో షర్మిల తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. వైఎస్ షర్మిలతో పాటుగా ,బ్రదర్ అనిల్ కుమార్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
నివాళులర్పించిన అనంతరం...
ముందుగా ఇడుపులపాయలో తన తండ్రి వైఎస్సార్ సమాధి వద్ద నివాళులర్పించిన అనంతరం వైఎస్ షర్మిల, బ్రదర్ అనిల్ కుమార్ లు ఇద్దరూ పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆమె కోరారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే ప్రతి ఒక్కరూ తమ ఓటును వినియోగించుకోవాలని కోరారు.
Next Story