Mon Dec 15 2025 03:56:22 GMT+0000 (Coordinated Universal Time)
Ys Sharmila : నేడు కడప జిల్లాలో రెండో విడత న్యాయయాత్ర
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెండో రోజు కడప జిల్లాలో పర్యటిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెండో రోజు కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. ఆమె న్యాయయాత్ర పేరిట బస్సు యాత్రను నిర్వహిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. నిన్న బద్వేల్ నియోజకవర్గం నుంచి ప్రారంభమయిన యాత్ర నేడు రెండో రోజు కూడా కడప జిల్లాలోనే కొనసాగుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
నేటి యాత్ర ఇలా...
ఉదయం 9.30 గంటలకు కడప అమీన్ పీర్ దర్గాను దర్శించుకుంటారు. 11 గంటలకు మాసాపేట సర్కిల్ , 11.30 గంటలకు దేవుని కడప, మధ్యాహ్నం 12 గంటలకు అశోక నగర్, అప్సరా సర్కిల్ మధ్యాహ్నం ఒంటి గంటలకు అంబేడ్కర్ సర్కిల్ వద్ద బహిరంగ సభల్లో ఆమె పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు ఐటీఐ సర్కిల్,మరియాపురం,బిల్టప్ సెంటర్,వినాయక్ నగర్ అల్మాస్పేట,చిలకల బావి,7 రోడ్స్ మీదుగా యాత్ర కొనసాగనుంది.
Next Story

