Mon Dec 23 2024 04:44:38 GMT+0000 (Coordinated Universal Time)
Ys Sharmila : వైఎస్సార్ విగ్రహాలపై దాడులు - వైఎస్ షర్మిల రియాక్షన్
రాష్ట్రంలో వైఎస్సార్ విగ్రహాలపై జరుగుతున్న దాడులపై కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు.
రాష్ట్రంలో వైఎస్సార్ విగ్రహాలపై జరుగుతున్న దాడులపై కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. అల్లరి మూకలు చేస్తున్న వికృత దాడులను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి అరాచకాలు జరగడం అత్యంత దారుణం, మిక్కిలి శోచనీయమని తెలిపారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇలాంటి రౌడీ చర్యలు ఖండించి తీరాల్సిందేనని, ఇది పిరికిపందల చర్య తప్ప మరోటి కాదని వైఎస్ షర్మిల అభిప్రాయపడ్డారు.
చట్టపరంగా...
తెలుగువాళ్ళ గుండెల్లో గూడుకట్టుకున్న వైఎస్సార్ విశేష ప్రజాదరణ పొందిన నాయకులు అని షర్మిల కొనియాడారు. తెలుగు ప్రజల హృదయాల్లో ఆయనది చెరపలేని ఒక జ్ఞాపకమని, అటువంటి నేతకు నీచ రాజకీయాలు ఆపాదించడం సరికాదన్నారు. గెలుపోటములు ఆపాదించడం తగదని, వైఎస్సార్ ను అవమాయించేలా ఉన్న ఈ హీనమైన చర్యలకు.. బాధ్యులైన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Next Story