Sun Dec 22 2024 17:50:23 GMT+0000 (Coordinated Universal Time)
Ys Sharmila : వైఎస్ షర్మిల అనూహ్య నిర్ణయం.. తెలిస్తే నోరు వెళ్లబెట్టాల్సిందే
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన నిర్ణయం తీసుకున్నారు
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎవరూ ఊహించని నిర్ణయం ఆమె తీసుకున్నారు. ఇటీవల పార్టీ హైకమాండ్ ను కలసి వచ్చిన అనంతరం ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీలో ఉన్న అన్ని విభాగాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నామో కూడా షర్మిల వివరించారు. పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా కమిటలన్నింటినీ రద్దు చేస్తున్నట్లు ఆమె తెలిపారు.
కొత్త కమిటీలను...
కొత్త కమిటీలను త్వరలో ఏర్పాటు చేయనున్నామని వైఎస్ షర్మిల తెలిపారు. ఏపీలో కాంగ్రెస్ ఘోర ఓటమి చెందిన తర్వాత వైఎస్ షర్మిలను టార్గెట్ చేస్తూ కొందరు నేతలు నేరుగా విమర్శలు చేశారు వారిని నేరుగా తొలగించకుండా మొత్తం కమిటీలను రద్దు చేసి తర్వాత కొత్త వారితో కమిటీలను నియమించవచ్చన్న భావనతోనే ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Next Story