Mon Dec 23 2024 03:53:00 GMT+0000 (Coordinated Universal Time)
Ys Sharmila : నేడు ఢిల్లీలో వైఎస్ షర్మిల దీక్ష
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నేడు ఢిల్లీలో దీక్షకు దిగనున్నారు.
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నేడు ఢిల్లీలో దీక్షకు దిగనున్నారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని కోరుతూ ఏపీ భవన్ లో దీక్షకు దిగనున్నారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జరుగుతుండటంతో ప్రభుత్వంపై వత్తిడి తెచ్చేందుకు వైఎస్ షర్మిల నేడు ఢిల్లీలో దీక్షకు దిగనున్నారు.
పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో...
ఈ దీక్ష ద్వారా ప్రజల నుంచి మద్దతును కూడగట్టడమే కాకుండా పార్టీని బలోపేతం చేసేందుకు కూడా ఉపయోగపడనుంది. ఢిల్లీలో వైఎస్ షర్మిల శరద్ పవార్, సీతారం ఏచూరి వంటి నేతలతో కూడా సమావేశమై ఆంధ్రప్రదేశ్ కు బీజేపీ చేసిన అన్యాయాన్ని వివరించనున్నారు. వారి మద్దతును కూడగట్టనున్నారు. మధ్యాహ్నం నుంచి ఏపీ భవన్ లో ధర్నాకు దిగనున్నారు.
Next Story