Thu Dec 19 2024 23:48:10 GMT+0000 (Coordinated Universal Time)
Ys Sharmila : నేడు ఇచ్చాపురంలో వైఎస్ షర్మిల
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నేడు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నేడు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. నిన్న రాత్రే శ్రీకాకుళం చేరుకున్న జగన్ నేడు ఇచ్ఛాపురం నియోజకవర్గంలో పర్యటిస్తారు. పార్టీ సమావేశంలో ఆమె పాల్గొంటారు. ఈరోజు ఉదయం పదిన్నర గంటలకు ఇచ్ఛాపురం చేరుకుని ప్రజాప్రస్థాన విజయ స్థూపాన్ని వైఎస్ షర్మిల సందర్శిస్తారు.
కార్యకర్తలతో సమావేశం....
ఆ తర్వాత స్థానికంగా జరిగే ప్రయివేటు ఫంక్షన్ హాలులో కార్యకర్తలు, పార్టీ నాయకులతో సమావేశం కానున్నారు. శ్రీకాకుళం జిల్లాలో కాంగ్రెస్ బలోపేతానికి అవసరమైన చర్యలు తీసుకోనున్నారు. షర్మిల వెంట పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి మాణికం ఠాగూర్, పీసీసీ మాజీ అధ్యక్షులు రఘువీరారెడ్డి, గిడుగు రుద్రరాజు, సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు లు పాల్గొననున్నారు.
Next Story