Sun Dec 22 2024 16:13:39 GMT+0000 (Coordinated Universal Time)
రాజస్థాన్ లో వైఎస్ రాజారెడ్డి వివాహ వేడుక
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహం రాజస్థాన్ లో వైభవంగా జరిగింది.
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహం రాజస్థాన్ లో వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యులు, అతి ముఖ్యమైన సన్నిహితుల మధ్య ఈ వివాహ వేడుక ముగిసింది. రాజస్థాన్ లోని జోధ్పూర్ లో శనివారం వైఎస్ రాజారెడ్డి, అట్లూరి ప్రియల వివాహం జరిగింది. వైఎస్ విజయమ్మతో పాటు కుటుంబంలోని ముఖ్యమైన వారంతా ఈ వివాహానికి హాజరయ్యారు.
కుటుంబ సభ్యుల సమక్షంలో...
కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు ముఖ్యులు ఈ వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. అయితే ఈ వివాహ వేడుకలకు షర్మిల సోదరుడు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాత్రం దూరంగా ఉన్నారు. ఆయన ఇటీవల నిశ్చితార్ధం వేడుకలో పాల్గొన్నారు. ఎన్నికలు సమీపిస్తుండటం, అభ్యర్థుల ఎంపికలో తలమునకలై ఉన్న జగన్ ఈ వివాహానికి హాజరు కాలేకపోయారని పార్టీ నేతలు చెబుతున్నారు.
Next Story