Mon Dec 23 2024 07:35:30 GMT+0000 (Coordinated Universal Time)
Ys Sharmila : మేనమామ ఇలాకాలో నేడు వైఎస్ షర్మిల
కడప జిల్లాలో మూడో రోజు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల యాత్ర కొనసాగుతుంది
కడప జిల్లాలో మూడో రోజు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల యాత్ర కొనసాగుతుంది. న్యాయయాత్ర పేరిట ఆమె బస్సు యాత్రను గత రెండు రోజుల నుంచి జరుపుతున్నారు. కడప కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో ఉన్న వైఎస్ షర్మిల తొలుత తాను పోటీ చేయనున్న నియోజకవర్గాల్లోనే పర్యటిస్తున్నారు.
న్యాయ యాత్ర పేరిట...
ఏపి న్యాయ యాత్ర పేరిట ఆమె జరుపుతున్న యాత్రకు మంచి స్పందన లభిస్తుంది. ఈరోజు కమలాపూరం నియోజక వర్గంలో వైఎస్ షర్మిల పర్యటిస్తున్నారు. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నది వైసీపీ నుంచి ఆమె మేనమామ రవీంద్రనాధ్ రెడ్డి. షర్మిల సీకే దిన్నే, ఎళ్ళటూరు, పెండ్లిమర్రి, నందిమండలం, తంగేడుపల్లి,వి ఎన్ పల్లి,కమలాపురం,వల్లూరు, చెన్నూరు మీదుగా యాత్ర సాగనుంది.
Next Story