Tue Dec 24 2024 00:17:28 GMT+0000 (Coordinated Universal Time)
నేడు ఏపీ మంత్రి వర్గ సమావేశం
నేడు ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి సమావేశం జరగనుంది. జగన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు
నేడు ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఉదయం 11 గంటలకు ఈ సమావేశం ప్రారంభమవుతుంది. ఈ నెల 19వ తేదీ నుంచి 24వ తేదీ వరకూ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. దీనిపై కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశముందని తెలిసింది.
మూడు రాజధానుల అంశం...
దీంతో పాటు సీీపీఎస్ అంశంపై కూడా చర్చించే అవకాశం ఉంది. జీపీఎస్ అమలుపై ప్రభుత్వం ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చింది. దీనికి సంబంధించిన జీవోలను అధికారులు సిద్ధం చేశారు. వీటిని మంత్రి వర్గ సమావేశంలో లాంఛనంగా ఆమోదించే అవకాశముంది. దీంతో పాటు మూడు రాజధానుల అంశంపై కూడా చర్చ జరిగే అవకాశముంది. ఈ సమావేశాల్లోనే బిల్లులు ప్రవేశపెట్టే అవకాశముందని తెలుస్తోంది.
Next Story