Tue Nov 05 2024 16:29:17 GMT+0000 (Coordinated Universal Time)
కీలకంగా మారిన కోటి.. విచారణకు రావాల్సిందేనన్న ఏపీ సీఐడీ
మార్గదర్శి చిట్ఫండ్స్ నిధుల మళ్లింపు, అక్రమాల ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్న ఏపీ సీఐడీ మంగళవారం ఓ కీలక ప్రకటన చేసింది.
మార్గదర్శి చిట్ఫండ్స్ నిధుల మళ్లింపు, అక్రమాల ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్న ఏపీ సీఐడీ మంగళవారం ఓ కీలక ప్రకటన చేసింది. మార్గదర్శి లో రూ. కోటి పైన నగదు డిపాజిట్ చేసిన ఖాతాదారులకు నోటీసులు జారీ చేసినట్లు ఒక ప్రెస్నోట్లో తెలిపింది. మార్గదర్శి కేసు దర్యాప్తులో భాగంగా కోటి రూపాయలకు పైగా నగదు రూపంలో చందాలు కట్టిన చందాదారులకు నోటీసులు జారీ చేస్తున్నట్లు సీఐడీ ఓ ప్రకటన విడుదల చేసింది. రిజర్వ్ బ్యాంక్, కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు నిబంధనల్ని ఉల్లంఘించి కోటి రూపాయలకు మించి నగదుతో చిట్స్ వేసిన వారికి నోటీసులు జారీ చేస్తున్నట్లు సీఐడీ తెలిపింది.
కోటి రూపాయలకు పైగా చిట్స్ వేసిన వ్యక్తిగత చందాదారులకు మాత్రమే నోటీసులు ఇస్తున్నట్లు తెలిపింది. ఆర్బీఐ, సీబీడీటీ నిబంధనల ప్రకారం నోటీస్ లు జారీ చేసినట్లు ఏపీ సీఐడీ సదరు నోట్లో పేర్కొంది. ఈ మేరకు మార్గదర్శి లో రూ. కోటి పైన నగదు లావాదేవీల వివరాలు తెలపాలని పేర్కొంది. ఆర్థిక నేరాల, మనీ లాండరింగ్ నివారణకు RBI, CBDT తీసుకొచ్చిన నిబంధనల మేరకే ఈ నోటీసులు జారీ చేసినట్లు ఏపీ సీఐడీ స్పష్టం చేసింది.
కోటి రూపాయలకు పైగా చిట్ గ్రూపుల్లో నగదు డిపాజిట్ చేసిన చందాదారులపై సిఐడి ప్రత్యేకంగా లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది. నోటీసులు అందుకున్న చందాదారులందరూ విచారణకు సహకరించాలని ఏపీ సీఐడీ కోరింది. ఖచ్చితమైన అందించడం ద్వారా నిజం బయటపడుతుందని.. నిజం బయటకు తీసుకుని వచ్చి దోషులను న్యాయస్థానానికి తీసుకురావడంలో చందాదారులు అధికారులకు సహాయపడాలని కోరారు. నిష్పాక్షికమైన విచారణ జరిగేలా అన్ని అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఏపీ సీఐడీ తెలిపింది.
Next Story