Sat Jul 06 2024 02:10:28 GMT+0000 (Coordinated Universal Time)
Pawan Kalyan : ఆ ఎమ్మెల్యేలిద్దరికీ పవన్ బంపర్ ఆఫర్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పార్టీ జనసేకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేకు అదిరిపోయే ఆఫర్ ఇచ్చా
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పార్టీ జనసేనకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేకు అదిరిపోయే ఆఫర్ ఇచ్చారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు. జనసేన పార్టీకి చెందిన ఇద్దరు శాసనసభ్యులను ప్రభుత్వ విప్ లుగా ప్రకటించాలని ఆయన చంద్రబాబుకు రాసిన లేఖలో కోరారు.
విప్ లుగా నియమించాలని...
నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ లను ప్రభుత్వ విప్ లుగా నియమించాలని కోరుతూ పవన్ కల్యాణ్ చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు. విప్ పదవులతో వారికి ప్రభుత్వంలో ప్రాధాన్యత పెంచేలా పవన్ కల్యాణ్ నిర్ణయం తీసుకున్నట్లయింది. బహుశ పవన్ కల్యాణ్ ప్రతిపాదనకు చంద్రబాబు ఎటువంటి అభ్యంతరం చెప్పే అవకాశం ఉండకపోవచ్చు.
Next Story