Mon Dec 23 2024 03:22:10 GMT+0000 (Coordinated Universal Time)
Pawan Kalyan : మరో దీక్షకు దిగననున్న పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రస్తుతం వారాహి అమ్మవారి దీక్షలో ఉన్నారు
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రస్తుతం వారాహి అమ్మవారి దీక్షలో ఉన్నారు. ఇది ముగిసిన వెంటనే చాతుర్మాస దీక్షను చేపట్టనున్నారు. చతుర్మాస దీక్షను పవన్ కల్యాణ్ గత రెండు దశాబ్దాలుగా చేస్తూ వస్తున్నారు. దీక్షలో ఉండి కూడా ఉపముఖ్యమంత్రిగా విధులు చేపడుతున్న పవన్ కల్యాణ్ వివిధ సమావేశాలకు హాజరవుతున్నారు.
నాలుగు నెలలు...
చాతుర్మాస దీక్షనాలుగు నెలల పాటు కొనసాగనుంది. పవన్ కల్యాణ్ నాలుగు నెలల పాటు చాతుర్మాస దీక్షలో ఉంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఆయన ప్రతి ఏడాది ఈ దీక్షను చేపట్టి పూర్తిచేస్తారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం అయినప్పటికీ నాలుగు నెలల పాటు చాతుర్మాస దీక్షను కొనసాగించాలని నిర్ణయించారు.
Next Story