Tue Jan 07 2025 20:10:37 GMT+0000 (Coordinated Universal Time)
Pawan Kalyan : పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం.. ఇకపై ఆ రోడ్డుపైనే వెళతా
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ఏడీబీ రోడ్డుపైనే వెళతానని ప్రకటించారు
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై పిఠాపురం వెళ్లేందుకు ఏడీబీ రోడ్డుపైనే వెళతానని ప్రకటించారు. ఇటీవల రాజమండ్రిలో జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు హాజరై తిరిగి వెళుతుండగా ఇద్దరు యువకులు మరణించిన నేపథ్యంలో పవన్ కల్యాణ్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
కూటమి ప్రభుత్వం...
ఏడీబీ రహదారిని గత ప్రభుత్వం ఐదేళ్ల నుంచి పట్టించుకోలేదని, రోడ్డంతా గుంతలమయంగా మారిపోయినా నిధులు విడుదల చేయలేదని పవన్ కల్యాణ్ అన్నారు. ఏడీబీ రోడ్డు మరమ్మతులకు తమకూటమి ప్రభుత్వం నిధులను మంజూరు చేసిందని, పనులు కూడా ప్రారంభమయ్యాయని తెలిపారు. తాను కూడా ఇకపై పిఠాపురం వెళ్లాలంటే ఏడీబీ రోడ్డు నుంచి వెళతానని ఆయన ప్రకటించారు. దీంతో పాటు ఈ ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు జనసేన పార్టీ నుంచి ఐదు లక్షల రూపాయల విరాళం ప్రకటించారు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App నౌ
Next Story