Sun Dec 22 2024 16:14:40 GMT+0000 (Coordinated Universal Time)
Pawan Kalyan : నేడు ఢిల్లీకి పవన్ కల్యాణ్.. అమిత్ షాతో భేటీ
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేడు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేడు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. ఈరోజు ఉదయం ఆయన గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరి ఢిల్లీకి చేరుకుంటారు. అనంతరం సాయంత్రం 6.30 గంటలకు హోంమంత్రి అమిత్ షాతో సమావేశం అవ్వనున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న వివిధ పరిణామాలను కేంద్రమంత్రి అమిత్ షాకు ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ వివరించే అవకాశం ఉంది.
రాష్ట్రానికి సంబంధించిన...
ఇటీవల హోం శాఖ పై ఆరోపణలు చేయడం, వెంటనే అమిత్ షా నుంచి పిలుపు రావడం ఈ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. సరస్వతి పవర్ ప్రాజెక్టును కూడా సందర్శించిన నేపథ్యంలో జగన్ ప్రాజెక్టు కావడంతో అమిత్ షాతో ఆ విషయాలు కూడా చర్చించే అవకాశాలున్నాయి. మొత్తం మీద జనసేన అధినేతగా పవన్ కల్యాణ్ ఐదు నెలల తర్వాత రాష్ట్ర పనులపైన ఢిల్లీ వెళ్లడం ఇదే మొదటి సారి కావడంతో రాజకీయంగా చర్చ జరుగుతుంది. మరి ఈ సమావేశంలో పవన్ కల్యాణ్ ఏ విషయాలు మాట్లాడతారన్నది ఆసక్తికరంగా మారింది. కూటమి పార్టీల్లోనూ ఉత్కంఠ నెలకొంది.
Next Story