Fri Dec 27 2024 03:32:38 GMT+0000 (Coordinated Universal Time)
Pawan Kalyan : నేటి నుంచి పవన్ కల్యాణ్ దీక్ష
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేటి నుంచి దీక్షను ప్రారంభించనున్నారు. మొత్తం పదకొండు రోజుల పాటు ఈ దీక్ష చేపట్టనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేటి నుంచి దీక్షను ప్రారంభించనున్నారు. మొత్తం పదకొండు రోజుల పాటు ఈ దీక్ష చేపట్టనున్నారు. ప్రాయశ్చిత్త దీక్షగా దీనిని పవన్ కల్యాణ్ నేటి నుంచి పదకొండు రోజుల పాటు చేయనున్నారు. తిరుమల లడ్డూ తయారీలో జంతువుల నూనె కలవడంపై మనస్తాపం చెందిన పవన్ కల్యాణ్ ఈ దీక్షను నేటి నుంచి ప్రారంభించారు.
పదకొండు రోజులు...
తిరుమలలో జరిగిన అపచారానికి ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అందులో భాగంగా తాను ఈ దీక్షను చేపడుతున్నట్లు పవన్ తెలిపారు. గత పాలకుల అరాచకాలు తిరుమల స్వామి వారి సన్నిధిలోనూ జరగడం అన్యాయమన్న పవన్ కల్యాణ్ ప్రజాక్షేమాన్ని కాంక్షించి తాను ప్రాయశ్చిత్త దీక్ష చేపడుతున్నట్లు తెలిపారు. గుంటూరు జిల్లా నంబూరులో ఉన్న వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఆయన ఈ దీక్ష చేపట్టనున్నారు. పదకొండు రోజుల పాటు దీక్ష చేపట్టిన అనంతరం తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకుంటానని పవన్ కల్యాణ్ తెలిపారు.
Next Story