Mon Dec 15 2025 04:17:21 GMT+0000 (Coordinated Universal Time)
Pawan Kalyan : నేడు గుంటూరు జిల్లాకు పవన్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేడు గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు.

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేడు గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈరోజు ఆయన గుంటూరుకు చేరుకుని వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రధానంగా గుంటూరు నగరపాలెంలోని అరణ్య భవన్ లో అటవీ శాఖ మరణించిన వారి అమరవీరుల సంస్మరణ సభలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొంటారు.
అమరవీరుల సంస్మరణ సభలో...
వారికి నివాళులర్పించి అనంతరం సభలో ప్రసంగించనున్నారు. పవన్ కల్యాణ్ పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను అధికారులు పూర్తిచేశారు. పవన్ రాకతో పెద్దయెత్తున అభిమానులు వస్తారన్న అంచనాలతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అభిమానులతో పాటు పార్టీ కార్యకర్తలు కూడా పెద్దయెత్తున తరలి వచ్చే అవకాశముంది.
Next Story

