Mon Dec 23 2024 03:49:40 GMT+0000 (Coordinated Universal Time)
Pawan Kalyan : నేడు కాకినాడ కలెక్టరేట్ లో పవన్ సమీక్ష
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేడు కాకినాడ జిల్లాలో రెండో రోజు పర్యటన కొనసాగుతుంది
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేడు కాకినాడ జిల్లాలో రెండో రోజు పర్యటన కొనసాగుతుంది. ఈరోజు కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించనున్నారు. పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి, అటవీశఆఖ, పొల్యూషన్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సమీక్ష చేయనున్నారు. సమగ్ర సమాచారంతో సమావేశానికి రావాలని ఇప్పటికే అధికారులకు పవన్ కల్యాణ్ సూచించారు.
ఎమ్మెల్యేలు, ఎంపీలతో...
అనంతరం సాయంత్రం గొల్లప్రోలులోిన తన క్యాంప్ కార్యాలయంలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో ఆయన సమావేశం కానున్నారు. వారికి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై పవన్ కల్యాణ్ చర్చించనున్నారు. దీంతో పాటు రాజకీయ పరమైన అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశముంది. 21 మంది ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గ సమస్యల పరిష్కారంపై ఫోకస్ పెట్టాలని వారికి సూచించనున్నారు.
Next Story