Mon Dec 23 2024 06:34:27 GMT+0000 (Coordinated Universal Time)
Vijayawada New year offer:ఏపీలో మందుబాబులకు భారీ ఆఫర్
కొత్త ఏడాది వేడుకల సందర్భంగా బెజవాడ ఎక్సైజ్ శాఖ అధికారులు మద్యం తాగే వారికి గుడ్ న్యూస్ చెప్పారు
కొత్త ఏడాది వేడుకల సందర్భంగా బెజవాడ పోలీసులు మద్యం తాగే వారికి గుడ్ న్యూస్ చెప్పారు భారీ ఆఫర్ ప్రకటించారు. ఈరోజు రాత్రి, రేపు మద్యం షాపులు అర్థరాత్రి పన్నెండు గంటల వరకూ తెరచి ఉంటాయని ఏపీ ఎక్సైజ్ శాఖ ప్రకటించింది. ఈ రెండు రోజుల పాటు ఈ నిబంధనలు వర్తిస్తాయని తెలిపింది. తాగినోడు తాగినంతగా మద్యం లభిస్తుందని పేర్కొంది. ఇక అనుమతి తీసుకుంటే మాత్రం స్టార్ హోటల్స్ లో, క్లబ్ లు మాత్రి రాత్రి ఒంటి గంట వరకూ మద్యం విక్రయాలకు అనుమతిచ్చింది.
పోలీసు శాఖ మాత్రం...
దీంతో ఎక్సైజ్ శాఖ పోలీసులకు పెద్దయెత్తున అనుమతుల కోసం దరఖాస్తులు వస్తున్నాయి. బార్ షాపుల యజమానులు కూడా అనుమతుల కోసం అప్లయ్ చేసుకుంటున్నారు. అయితే మరోవైపు పోలీసులు మాత్రం డిసెంబరు 31వ తేదీ రాత్రి ఆంక్షలు విధించారు. సెక్షన్ 30తో పాటు 144వ సెక్షన్ కూడా అమలులో ఉంటుందని పోలీసులు తెలిపారు. నలుగురైదుగురు గుమిగూడితో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డీజేలకు ఎటువంటి అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు.
Next Story