Mon Dec 23 2024 16:19:59 GMT+0000 (Coordinated Universal Time)
"సుప్రీం" తలుపు తట్టిన ఏపీ సర్కార్
కృష్ణా జలాల ట్రిబ్యునల్‌పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
కృష్ణా జలాల ట్రిబ్యునల్‌పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ట్రిబ్యులన్ విధి విధానాలను సవాల్ చేస్తూ సుప్రీంలో ఏపీ సర్కార్ పిటీషన్ దాఖలు చేసింది. బ్రిజేష్ ట్రిబ్యునల్‌కు అదనపు బాధ్యతలు అప్పగించే వీలు, అధికారం లేదంటూ సుప్రీంకోర్టు తలుపు తట్టింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం నీటి కేటాయింపులకు రక్షణ ఉందని, నీటిని ప్రాజెక్టుల వారీగా కేటాయించే అంశం పరిశీలనలో ఉందని, ఇప్పుడు కొత్త అంశాలను చేర్చడం సరికాదని ఏపీ ప్రభుత్వం వాదిస్తుంది.
కృష్ణా జలాల పంపిణీపై....
మరోవైపు నేటి నుంచి కృష్ణా జలాల పంపిణీపై ట్రిబ్యునల్ విచారణ చేపట్టనుంది. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు విచారణ జరపనుంది. ఈ విచారణలో భాగంగా ఎటువంటి నిర్ణయం వెలువడుతుందన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఏపీ, తెలంగాణల మధ్య వాటాలను తేల్చడానికి ట్రైబ్యునల్ విచారణ చేపట్టనుంది. తెలంగాణ ఎన్నికలు జరుగుతుండటంతో దానికి అనుకూలంగా నిర్ణయం వస్తుందని భావించి ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు చెబుతున్నారు.
Next Story