Mon Dec 23 2024 10:01:39 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీ యాత్రికులు 48 మంది సురక్షితం.. లభ్యం కాని ఇద్దరి ఆచూకీ
అమర్నాథ్ యాత్రలో ఆంధ్రప్రదేశ్ యాత్రికుల క్షేమ సమాచారాలను ఏపీ ప్రభుత్వం సేకరిస్తుంది.
అమర్నాథ్ యాత్రలో ఆంధ్రప్రదేశ్ యాత్రికుల క్షేమ సమాచారాలను ఏపీ ప్రభుత్వం సేకరిస్తుంది. ఏపీ నుంచి అమర్నాథ్ యాత్రకు యాభై మంది యాత్రికులు వెళ్లారు. వీళ్లలో 48 మంది ఏపీ యాత్రికులు సురక్షితంగా ఉన్నట్లు ఏపీ అధికారులు గుర్తించారు. ఢిల్లీ ఏపీ భవన్ నుంచి ప్రత్యేకంగా ఏపీ నుంచి వెళ్లిన వారి క్షేమ సమాచారాలను సేకరించేందుకు అధికారులు వెళ్లారు. వారి ఆచూకీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
ప్రత్యేక బృందం...
నలభై ఎనిమిది మంది ఏపీ యాత్రికులు సురక్షితంగా ఉన్నారని అధికారులు గుర్తించారు. ఇద్దరి ఆచూకీ మాత్రం కన్పించడం లేదు. ఇద్దరూ మహిళలే కావడంతో వారి కోసం అధికారులు గాలిస్తున్నారు. యాభై మంది ఏపీ యాత్రికుల్లో 48 మంది సురక్షితంగా ఉన్నారని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం రెండు రోజుల పాటు అమర్నాథ్ యాత్రను నిలిపివేయడంతో కొందరు యాత్ర చేపట్టకుండానే వెనుదిరుగుతున్నారు.
Next Story