Mon Dec 16 2024 18:43:54 GMT+0000 (Coordinated Universal Time)
త్వరలోనే చలో విజయవాడ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల ఆందోళన కొనసాగుతుంది. తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ కొంతకాలంగా నిరసనలు తెలియజేస్తున్నారు
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగుల ఆందోళన కొనసాగుతుంది. తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ కొంతకాలంగా నిరసనలు తెలియజేస్తున్నారు. ఈరోజురాషట్్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద ఏపీ జేఏసీ ఆధ్వర్యంలో మహా ధర్నాలు జరుగుతున్నాయి. తిరుపతి కలెక్టరేట్ వద్ద జరిగిన ధర్నాకు ఏపీ జేఏపీ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే రోజుల్లో చలో విజయవాడ వంటి కార్యక్రమాలు చేపడతామన్నారు. ఉద్యోగ సంఘాలను ఇబ్బందులు పాలు చేసి దారికి తెచ్చుకోవాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు.
ఐక్యతతోనే...
ఉద్యోగుల మధ్య ఐక్యత ఉందని.. ఉద్యోగ సంఘాల నేతలు కలిసి పోరాటం సాగిస్తామని తెలిపారు.నాయకుల తీరు ఎలా ఉన్నా సంఘాలకు అతీతంగా ఉద్యోగులు కదిలి వస్తున్నారని బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. ప్రైవేట్ కంపెనీ ద్వారా ప్రభుత్వం జీతాలు చెల్లిస్తోందని, ఎంత ఇవ్వాలో లెక్క కూడా చెప్పలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందని విమర్శించారు. ట్రెజరీ ద్వారా మాత్రమే తమకు పేమెంట్స్ జరగాలని డిమాండ్ చేశారు. తమ ఉద్యమంపై మంత్రులు అవహేళన చేయడం ద్వారా ఉద్యోగుల్లో మరింత కసి పెరుగుతోందని బొప్పరాజు అభిప్రాయపడ్డారు.
Next Story