Sun Dec 22 2024 23:10:27 GMT+0000 (Coordinated Universal Time)
ఒకటో తేదీ జీతాలు అందలేదే?
సాంకేతిక సమస్యతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ఏప్రిల్ 1వ తేదీన జీతాలు అందలేదు
సాంకేతిక సమస్యతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ఏప్రిల్ 1వ తేదీన జీతాలు అందలేదు. నిధులు సిద్ధంగా ఉన్నా సాఫ్ట్ వేర్ సమస్య తో నే చెల్లింపులు నిలిచిపోయినట్లు తెలుస్తోంది. ప్రతి నెల సీఎఫ్ఎంఎస్ ద్వారా రిజర్వ్ బ్యాంకుకు ప్రభుత్వ ఉద్యోగుల వివరాలు వెళ్లి నేరుగా వారి ఖాతాల్లో జీతాలు జమ అయ్యేవి. అయితే ప్రభుత్వం కొత్త పీఆర్సీ అమలు చేయడంతో పెరోల్ హెర్బ్ అనే వెబ్ ద్వారా వేతనాల చెల్లింపు జరపాలని ఆర్థిక శాఖ నిర్ణయించింది.
సాంకేతిక సమస్య....
అయితే నూతన పేరోల్ హెర్బ్ రిజర్వ్ బ్యాంకుకు అనుసంధానం కాకపోవడంతో మార్చి నెల జీతాల చెల్లింపులు నిలిచిపోయాయి. దీంతో పాత విధానంలోనే ఉద్యోగులకు జీతాలు చెల్లించాలని నిర్ణయించారు. వేతన బిల్లులను అప్ లోడ్ చేసే పనిలో ఉన్నారు. ఈరోజు ఉద్యోగుల జీతాలు వారి ఖాతాల్లో పడే అవకాశముందని చెబుతున్నారు.
Next Story